పవన్ కళ్యాణ్ సతీమణి ‘అన్నా’ ఎక్కడ.?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయాలు.. వెరసి క్షణం తీరిక లేకుండా వున్నారాయన.

తాజాగా పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు తనయుడి వివాహ నిశ్చితార్ధ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, సినీ నటి లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నారు.

ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరైనా, ఆయన సతీమణి మాత్రం హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా రష్యన్ మహిళ. ఆమె ప్రస్తుతం సింగపూర్‌లో వున్నట్లు తెలుస్తోంది. పిల్లల చదువుల నిమిత్తం, కొన్నాళ్ళుగా ఆమె అక్కడే వుంటున్నారు.

పవన్ కళ్యాణ్ తరచూ సింగపూర్ వెళ్ళి వస్తున్నారు. వరుణ్ తేజ్ నిశ్చితార్ధమంటే, పెద్ద కార్యక్రమమే కదా.! ఆ కార్యక్రమానికి అన్నా లెజ్నెవా హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.