సర్కారు వారి పాట … ఆ విషయం ఎప్పుడు బయటపెడతారు ..?

ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్న మహేష్ బాబు త్వరలో ‘సర్కారు వారి పాట’ ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమాగా రూపొందనుండగా పరశురాం పెట్లా తెరకెక్కించబోతున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ..14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు.

Sarkaru Vaari Paata: Keerthy Suresh To Act With Mahesh Babu - ManaTelugu

యూనివర్సల్ కాన్సెప్ట్ తో రూపొందనున్న సర్కారు వారి పాట పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణా వల్ల ఈ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయి నవంబర్ నుంచి ప్రారంభం అవుతుందని సమాచారం. అమెరికాలో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన దర్శకుడు లొకేషన్స్ ని ఫైనల్ చేసి రెడీగా ఉన్నాడు.

యూనిట్ లో కొంతమందికి విసా సమస్య వచ్చిన కారణంగా ఈ సినిమా షూటింగ్ మొదలవకుండా బ్రేక్ పడింది. కాగా షూటింగ్ లేట్ గా ప్రారంభం అయినప్పటికి ఖచ్చితంగా సమ్మర్ లో మాత్రం భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. అంతేకాదు మహేష్ కూడా ఈ సినిమా కోసం బల్క్ గా డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఈ సినిమా సెట్స్ మీదకి వస్తే టాకీపార్ట్ కంప్లీట్ అయ్యేంతవరకు మహేష్ మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచంచ కూడదని కూడా భావిస్తున్నాడట. కాగా రీసెంట్ గా ఈ సినిమాలో మహేష్ కి జంటగా నటిస్తున్న మేయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

కాని మహేష్ సతీమణి నమ్రత రికమెండ్ చేసిన సాయీ మంజ్రేకర్ విషయం మాత్రం చిత్ర బృందం సస్పెన్స్ గా ఉంచారు. సర్కారు వారి పాటలో సెకండ్ లీడ్ గా సాయీ మంజ్రేకర్ ని తీసుకోమని నమ్రత సూచించినట్టు ఇంతకముందే వార్తలు వచ్చాయి. మరి ఎందుకు ఇంకా సాయీ మంజ్రేకర్ విషయం ప్రకటించలేదన్నది ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా దసరా పండగ సందర్భంగా సర్కారు వారి పాట నుంచి సర్‌ప్రై ఏదైనా ఉంటుందని ఫ్యాన్స్ భావించినప్పటికి నిరాశ తప్పలేదు.