అకిరానందన్ హీరోగా తెరంగేట్రమెప్పుడు.?

రేపో మాపో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడు అకిరానందన్ తెరంగేట్రం చేయబోతున్నాడట.! ఇది ఇప్పటి వార్త కాదు, గత కొన్నాళ్ళుగా ప్రచారంలో వున్న గాసిప్పే. ఇప్పుడు కూడా అధికారిక వార్తేమీ కాదు. ఇది కూడా గాసిప్పే.!

కాకపోతే, సీరియస్ గాసిప్ అట.! మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూర్తిగా అకిరానందన్ బాధ్యతల్ని తీసుకున్నారట.. నటనా కెరీర్‌కి సంబంధించి. పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో బిజీగా వున్నారు కదా.. అదీ సంగతి.

నిర్మాణ సంస్థలకి కొదవేం లేదు. దర్శకులూ దొరికేస్తారు. అన్ని విషయాలపైనా ఇప్పటికే పూర్తి క్లారిటీతో వుందట మెగా కాంపౌండ్. మంచి ముహూర్తం చూసుకుని లాంఛ్ చెయ్యాలనే ఆలోచనతో వున్నారట.

పవన్ కళ్యాణ్ తనయుడు కదా.. డాన్సులు, ఫైట్స్ సహా అంతకు మించి ఏవో ఆశిస్తారు అభిమానులు. వాటికి తగ్గట్టే, అకిరానందన్ ఆయా విషయాల్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది చివర్లో అకిరానందన్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళొచ్చన్నది తాజా ఖబర్. ఈలోగా, అకిరానందన్ మీద హైప్ వచ్చేలా స్టిల్స్ అయితే బయటకు తీస్తున్నారు.!