టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న విశ్వక్ సేన్ తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో రెండవ ఎపిసోడ్లో గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లో విశ్వక్ సేన్ తో పాటు మరొక యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా సందడి చేశాడు. నిజ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ ఇలా బాలయ్య షో కి అతిధులుగా హాజరై బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు.
తాజాగా రెండవ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ షోలో బాలకృష్ణ వీరిద్దరి సినిమా విషయాల గురించే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాడు. ఈ ఎపిసోడ్లో కుర్ర హీరోలతో కలిసి బాలకృష్ణ చేసిన సందడి యువతని బాగా ఆకట్టుకుంటుంది. అమ్మాయిల విషయం నుండి రాత్రి వేసే పెగ్ వరకు అన్ని విషయాల గురించి బాలకృష్ణ వీరితో డిస్కస్ చేశాడు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ అమ్మాయిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. తనకు అమ్మాయిలు కంటే అబ్బాయిలతోనే కంఫర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బాయిలు చాలా నిజాయితీగా ఉంటారు అంటూ చెప్పకు వచ్చాడు. అమ్మాయిలు అవసరం తీరాక సందర్భం వస్తే ప్లేటు ఫిరాయిస్తారు. అబ్బాయిలు ఉన్నంత నమ్మకంగా అమ్మాయిలు ఉండరు.. అంటూ అమ్మాయిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే అమ్మాయిల గురించి విశ్వక్ సేమ్ ఇలా మాట్లాడటంతో నీకు గతంలో బ్రేకప్ అయ్యిందా? అని బాలకృష్ణ అడగగానే.. అవును సార్ అంటూ బదులిచ్చాడు. అమ్మాయిల గురించి విశ్వక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.