అనుష్క, నాగ చైతన్యకు పెళ్లి.. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున రియాక్షన్ ఇదీ..!!

When news of ‘Anushka Shetty marrying Naga Chaitanya’ came to light; Here’s how dad Nagarjuna reacted

ఆగండాగండి.. టైటిల్ చూసి షాక్ కాకండి. ముందు ఇది చదవండి పూర్తిగా. అవి నాగచైతన్య మాంచి జోరుమీదున్న రోజులు. అంటే.. ఇంకా సమంత ఆయనకు పరిచయం కాని రోజులు అన్నమాట. అప్పటికే వరుస హిట్లతో చైతన్య టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు. అనుష్క కూడా వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్నది. అప్పుడే మొదలైంది ఓ గాసిప్. అదేనండి పుకారు. ఏంటి అంటే.. నాగ చైతన్యను అనుష్క పెళ్లి చేసుకుంటోంది… ఇదే విషయం అప్పట్లో హాట్ టాపిక్.

When news of ‘Anushka Shetty marrying Naga Chaitanya’ came to light; Here’s how dad Nagarjuna reacted
When news of ‘Anushka Shetty marrying Naga Chaitanya’ came to light; Here’s how dad Nagarjuna reacted

అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం జనాల మీద అంతగా లేకున్నా కూడా ఈ పుకారు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురయింది. అదేంటి.. తండ్రితో కలిసి కటించే హీరోయిన్.. కొడుకును చేసుకోవడం ఏంటి? అది కూడా వయసులో ఎంతో పెద్ద. ఇదెక్కడి విడ్డూరం.. అంటూ పెదవి విరిచారు.

నిజానికి ఈ వార్త పెద్ద న్యూస్ పేపర్ లో రావడంతో అందరూ ఇది నిజమే అనుకున్నారు. అంతే కాదు.. నాగార్జునకు బాగా దగ్గరి వ్యక్తికి చెందిన పేపర్ లోనే ఆ వార్త రావడంతో నిజమే కాబోలు అని అందరూ ముక్కున వేలేసుకున్నారు.

అయితే.. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే మీడియాపై విరుచుకుపడ్డారు. అసలు..ఇటువంటి వార్తలను ఎలా రాస్తారంటూ ఫైర్ అయ్యాడు. ఒక్కరు వార్త రాస్తే మిగితా వాళ్లు ఊరుకుంటారా? దాన్నే తిప్పి తిప్పి రాస్తారు కదా. అదే జరిగింది అప్పుడు కూడా.

When news of ‘Anushka Shetty marrying Naga Chaitanya’ came to light; Here’s how dad Nagarjuna reacted
When news of ‘Anushka Shetty marrying Naga Chaitanya’ came to light; Here’s how dad Nagarjuna reacted

పేపర్ వచ్చిన దాన్ని మిగితా వెబ్ సైట్లు కూడా ఇంకొంచెం మసాలా జోడించి మరీ అచ్చేశాయి. న్యూస్ చానెల్స్ లో స్టోరీ కూడా. వీటన్నింటినీ చూసి నాగార్జునకు చిర్రెత్తుకొచ్చిందట. దీంతో వెంటనే ఆ పుకారును కవర్ చేసిన మీడియా మీద ఫైర్ అయ్యాడు. బాగా సీరియస్ అయ్యాడు.

ఆ తర్వాత అనుష్క కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి.. ఇదంతా అబద్ధం.. అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావాలని.. ఎవరో ఇదంతా చేశారని.. ఇందులో ఒక్క శాతం కూడా నిజం లేదని ఆమె కుండబద్ధులు కొట్టాక కానీ.. మీడియా, జనాలు నమ్మలేదు.

When news of ‘Anushka Shetty marrying Naga Chaitanya’ came to light; Here’s how dad Nagarjuna reacted
When news of ‘Anushka Shetty marrying Naga Chaitanya’ came to light; Here’s how dad Nagarjuna reacted

నిజానికి.. అనుష్క సినిమాల్లోకి వచ్చిందంటేనే దానికి కారణం నాగార్జున. అందుకే.. నాగ్ పై అనుష్కపై ప్రత్యేకమైన అభిమానం. నాగ్ ఆమెకు సూపర్ సినిమాలో చాన్స్ ఇవ్వడంతో అక్కడి నుంచి ఆమె వెనుదిరగకుండా వరస ఆఫర్లను దక్కించుకుంది.

వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అప్పట్లో.. వాళ్లిద్దరి మధ్య కూడా ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి. నాగ్, అనుష్క మధ్య ఏదో ఉందంటూ ఎన్నో పుకార్లు వచ్చినా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. నాగ చైతన్యతో అనుష్క పెళ్లి అనేసరికి మాత్ర నాగ్ ఉవ్వెత్తున లేచాడు. వెంటనే మీడియాను ఉతికి ఆరేశాడు. ఒకే హీరోయిన్ తో అటు తండ్రి, ఇటు కొడుకుకు సంబంధాన్ని అంటగట్టారన్నమాట చివరకు.  అది అసలు మ్యాటర్.