ఫస్ట్ నైట్ రోజు చైతన్య ఇచ్చిన గిఫ్ట్ ను సమంత ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి వారిలో సమంత నాగచైతన్య దంపతులు ఒకరు.వీరిద్దరూ ఏం మాయ చేసావే సినిమాతో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక నాలుగు సంవత్సరాలు పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న వీరిద్దరూ అక్టోబర్ రెండవ తేదీ విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోగా ప్రస్తుతం ఎవరి కెరియర్ పై వారు దృష్టిపెట్టారు. ఇక సమంత ఇప్పుడిప్పుడే వీరి విడాకుల విషయం నుంచి బయటపడుతూ తనని తాను మరింత బలంగా దృఢంగా మార్చుకుంటున్నానని సమంత ఒక షోలో వెల్లడించారు. నాగచైతన్య సైతం ఇద్దరం విడాకులు తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నామని సమంత గురించి చెప్పడమే కాకుండా తనపై ఎప్పటికీ గౌరవం ఉంటుందని, ఇప్పుడు కనుక తను ఎదురైతే తనకి హాయ్ చెప్పి హగ్ ఇస్తానంటూ సమంత గురించి పాజిటివ్ గానే మాట్లాడారు. కానీ సమంత మాత్రం చైతన్య గురించి మాట్లాడుతూ తను నా మాజీ భర్త అని చెప్పడమే కాకుండా మా ఇద్దరినీ ఒకే గదిలో పెడితే చుట్టూ కత్తులు లేకుండా జాగ్రత్తగా పడాలి అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

ఇలా ఎంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం పెద్ద శత్రువులుగా మారారని సమంత మాటలు చూస్తుంటే అర్థమవుతుంది.ఇకపోతే ప్రేమలో ఉన్న సమయంలో నాగచైతన్య సమంతకు చిన్నచిన్న కానుకలు మినహా ఒకటి కూడా ఖరీదైన గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వలేదట. కానీ ఫస్ట్ నైట్ రోజు మాత్రం సమంతకు అదిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సమంత నాగచైతన్య పేర్లు వచ్చేలా లవ్ సింబల్ తో ఒక రింగ్ డిజైన్ చేయించారట.ఈ రింగ్ ను నాగచైతన్య సమంతకు ఎంతో ప్రేమగా ఫస్ట్ నైట్ రోజు ఇవ్వడంతో సమంత కూడా ఆ రింగును ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత సమంత తన మేనేజర్ సహాయంతో ఆ రింగును నాగచైతన్యకు పంపించినట్లు తెలుస్తోంది.ఇలా నాగచైతన్య ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆ గిఫ్ట్ కూడా తిరిగి ఇవ్వడంతో వీరి మధ్య ఉన్న రిలేషన్స్ అన్నింటిని కూడా తెంచుకున్నారని తెలుస్తుంది.