Jailer 2: జైలర్ 2లో బాలయ్య రోల్ ఎలా ఉండబోతోందంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచే వార్త చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మాస్ మాస్ స్టార్ బాలకృష్ణ ఈ సీక్వెల్‌లో పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ చేయబోతున్నారట. చెన్నై టాక్ ప్రకారం, బాలయ్య పక్కా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట, ఆ పాత్ర ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు వినికిడి.

ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ విషయం లైట్‌గా చెప్పినప్పటికీ, ఇప్పుడు అది నిజం కాబోతుందని తెలుస్తోంది. అంటే బాలయ్యకు కాస్త ప్రత్యేకమైన పోలీస్ ఆఫీసర్ రోల్ రాసినట్టు వినిపిస్తోంది. ప్రత్యేకంగా ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌లో రజనీకాంత్ బాలయ్య యూనిఫామ్ లో మాస్ ఎలివేషన్లు పడతాయట. అంతేకాదు, బాలయ్యను గుర్తు చేసే ఐకానిక్ టైటిల్ “లక్ష్మి నరసింహ”ని కూడా ఈ పాత్రకు ప్లాన్ చేస్తున్నారని టాక్.

ఇది మొదట రౌడీ ఇన్‌స్పెక్టర్ టైటిల్‌తో రావాలనుకున్నారు కానీ చివరికి దిలీప్ ఆలోచనలో మార్చినట్టు తెలుస్తోంది. రజనీ, బాలయ్యల కలయికను స్క్రీన్‌పై చూడటం అభిమానులకు పండగే. థియేటర్లలో ఫ్యాన్స్ జోష్ కు బూస్ట్ ఇచ్చేలా ఉండటం ఖాయం. ఈసారి నెల్సన్ ఈ మాస్ కాంబోను వదులకుండా పూర్తి స్థాయిలో చూపిస్తాడని ఇండస్ట్రీలో మాటలు వస్తున్నాయి. బాలయ్య రోల్ దాదాపు సెకండ్ హాఫ్ లో ఉంటుందని టాక్. షూటింగ్ కోసం 20 రోజుల కాల్షీట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇంకా సగం షూట్ పూర్తవకముందే జైలర్ 2 తెలుగు హక్కులకు కూడా డిమాండ్ మామూలుగా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ విషయంలో, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Kakinada Women Shocking Reaction On Operation Sindoor | AP Public Talk | Pakistan | Telugu Rajyam