లేటెస్ట్ : మేం చెప్పిన లుక్ లోనే “వాల్తేరు వీరయ్య” లో రవితేజ.!

ఈరోజు ఉదయమే టాలీవుడ్ మెగా మాస్ మల్టీ స్టారర్ అయినటువంటి చిత్రం “వాల్తేరు వీరయ్య” పై న్యూస్ వెల్లడించాము.. మెగాస్టార్ మరియు రవితేజ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలో అయితే రవితేజ పై ఓ ఇంట్రెస్టింగ్ విజువల్స్ తో కూడైన టీజర్ లేదా పోస్టర్ తో ఇంట్రడక్షన్ ఉంటుందని తెలిపాము.

మరి ఇప్పుడు దానిని నిజం చేస్తూ అయితే నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ సహా రవితేజ కూడా ఈ సినిమాలో తన లుక్ ని ప్రీ లుక్ పోస్టర్ తో అయితే రివీల్ చేశారు. మరి ఈ బ్రాండ్ న్యూ పోస్టర్ లో అయితే చెప్పినట్టుగా ఓ చేతిలో మేకపిల్ల మరో చేతిలో గొడ్డలి గ్యాస్ సిలిండర్ తో మాస్ మహారాజ్ దర్శనం ఇచ్చాడు.

దీనితో ఇప్పుడు ఈ మాస్ పోస్టర్ రాకతో అభిమానుల్లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అలాగే దీనిపై రవితేజ కూడా మాట్లాడుతూ నాకు తెలుసు మీరంతా దీనికోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అంటూ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ పై డేట్ మరియు సమయాన్ని అయితే అనౌన్స్ చేసేసాడు.

ఈ లుక్ ఈ డిసెంబర్ 12న రానుండగా ఆరోజు ఉదయం 11 గంటల 7 నిమిషాలకి అయితే రివీల్ కానున్నట్టుగా అనౌన్స్ చేసాడు. దీనితో అయితే దాదాపు మేము వీక్షకులకి ఇచ్చిన న్యూస్ నిజం అయ్యింది. మరి ఇలాంటి ఎగ్జైటింగ్ వార్తలు, అప్డేట్స్ కోసం తెలుగురాజ్యం సైట్ ని వీక్షిస్తూ ఉండండి.