NTR 30 : ఎన్టీఆర్ సినిమాలో ఆలియా నటించట్లేదట… కారణం అదేనా…!

 

NTR 30 : ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో రికార్డులు బద్దలు కొట్టిందో అందరికి తెలుసు. ఇక ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు మంచి పేరు వచ్చింది. ఏకంగా పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. ఇక ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న ఆలియా మాత్రం ఆంతృప్తితో ఉందని బాగా ప్రచారం జరిగింది.

ఇక ఆలియా నటించిన సన్నివేశాలు సినిమాలో తక్కువగా ఉండటమే దీనికి కారణమని చెప్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆలియా రణ్ బీర్ తో వివాహం చేసుకుంది. ఇక ఈ కారణాలన్నీ ఇపుడు ఎన్టీఆర్ 30 సినిమాపై ప్రభావం చూపిస్తున్నాయానే టాక్ వినిపిస్తోంది. కొరటాల దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆలియా కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా నుండి ఇపుడు ఆలియా తప్పుకున్నట్లు సమాచారం.

రణ్ బీర్ తో పెళ్లి, ఆర్ఆర్ఆర్ విషయంలో ఇంకా గుర్రుగానే ఉందట అందుకే సౌత్ సినిమాల వైపు చూడదట. ఇక బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని అనుకుంటోందట అదికాక ఇప్పటిదాకా కమిట్ అయిన సినిమాలు ఇక పెళ్లితో జీవితం బిజీగా ఉండటంతో సినిమా నుండి తప్పుకుంటున్నట్లు బాలీవుడ్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొరటాల ఎన్టీఆర్ సినిమా కోసం బాలీవుడ్ భామను అనుకుంటున్నారట. ఇక ఇపుడు జాన్వీ కపూర్ కానీ దిశా పటానీ ని అనుకుంటున్నారు. చూడాలి మరీ ఎన్టీఆర్ సినిమాలో ఏ భామ ఉంటుందో చూడాలి.