‘సర్కారు వారి పాట’ సినిమా సమయంలో వచ్చిన నెగెటివిటీ, బహుశా తెలుగు సినీ పరిశ్రమలో అంతకు ముందెన్నడూ చూడనిదేమో.! పవన్ కళ్యాణ్ సినిమాలకూ ఇలాగే వుంటుంది లెండి. అది వేరే సంగతి. ‘ఆచార్య’ సినిమా విషయంలోనూ అదే జరిగింది.
అయితే, ‘సర్కారు వారి పాట’ అంతటి నెగెటివిటీని తట్టుకుని నిలబడింది. మరి, ‘గుంటూరు కారం’ పరిస్థితేంటి.? ఫస్ట్ షో పడకుండానే, విపరీతమైన నెగెటివిటీ ప్రచారంలోకి వచ్చింది. డిజాస్టర్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
వాస్తవానికి మహేష్‌కి సినీ పరిశ్రమలో ‘యాంటీ’ అనేది పెద్దగా వుండదు. మెగాభిమానులూ మహేష్ సినిమాల్ని ఆదరిస్తారు. నందమూరి అభిమానులూ అంతే. కానీ, ఎందుకో ఎన్టీయార్ అభిమానులూ, అల్లు అర్జున్ అభిమానులూ ఈ మధ్య మహేష్ మీద కక్ష పెంచుకున్నారు.
అందునా, అల్లు అర్జున్ అభిమానులు మరీనూ.! అసలు అల్లు అర్జున్ ఆర్మీ ఎవర్నీ వదిలిపెట్టడంలేదు ఇటీవలి కాలంలో. దాన్ని పెయిడ్ ఆర్మీగా సినీ పరిశ్రమలో చాలామంది అభివర్ణిస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి.
హీరోలకి ఇగో సమస్యలేమీ లేవు. కానీ, హీరోల అభిమానుల పరిస్థితి వేరు. పీఆర్ టీమ్స్ ఈ మాఫియా వెనక వున్నాయన్నది అంతటా వినిపిస్తోన్నమాట. ఆ పీఆర్ టీమ్స్ విషయమై ‘గుంటూరు కారం’ బృందం గుస్సా అవుతోందిట.
సంక్రాంతి సీజన్ అయిపోయాక, ఆ సంగతేంటో తేల్చాలని ‘గుంటూరు కారం’ టీమ్ భావిస్తోందని సమాచారం.!