ఒక్క అంశంలో మాత్రం “కేజీఎఫ్” లెవెల్లో నాగ్ సినిమాని పోలుస్తున్నారు.!

కన్నడ సినిమా దగ్గర అయితే భారీ ఇండస్ట్రీ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది కేజీఎఫ్ సినిమాలే అని చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ సౌత్ ఇండియా సినిమా దగ్గర సహా పాన్ ఇండియా సినిమా దగ్గర కూడా మంచి స్టాండర్డ్స్ సెట్ చేసింది.

ముఖ్యంగా ఈ చిత్రాల్లో యాక్షన్ బ్లాక్ లు చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి. మన దగ్గర సరైన యాక్షన్ సినిమాలు పడితే వాటిని జనం బాగా ఆదరిస్తారు. అందుకు బెస్ట్ ఉదాహరణ రీసెంట్ గా వచ్చిన విక్రమ్ కూడా ఒకటి. మరి ఈ తరహా సినిమాల్లో అయితే అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ చిత్రం “ది ఘోస్ట్” కూడా చేరుతుంది అని చూసిన ఆడియెన్స్ అంటున్నారు.

కేజీఎఫ్ సినిమా తర్వాత అయితే తాము చూసిన ఒక బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అయితే ఇదే అంటున్నారు. ఆ రేంజ్ లో ఘోస్ట్ సినిమాలో ఏక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసారని అంటున్నారు. మొత్తానికి అయితే నాగ్ సినిమాకి మంచి గుర్తింపే వస్తుందని చెప్పాలి. దీనితో మళ్ళీ నాగ్ అయితే మంచి హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది.