రామ్ చరణ్ మార్కెట్ ఇప్పుడెంత.?

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. రామ్ చరణ్ మార్కెట్‌ని పాతాళానికి పడేసిందా.? ‘ఆచార్య’ విషయంలో కొందరిలో ఈ ప్రశ్న తలెత్తింది. అలా ఎలా.? అదే ‘ఆచార్య’ చేసిన చిరంజీవి, ‘వాల్తేరు వీరయ్య’తో బౌన్స్ బ్యాక్ అవలేదా.?

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. పాన్ ఇండియా హీరో అయ్యాడు. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బిజినెస్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

రామ్ చరణ్ మాత్రమే కాదు, ఈ సినిమాకి శంకర్ మరో పిల్లర్.! ఈ నేపథ్యంలోనే, సినిమాపై ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా పోతోంది. సినిమా నిర్మాణం ఆలస్యమవుతున్నాగానీ, సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం అందరిలోనూ కలుగుతోంది.

ఒక్క పాటకే ఇరవై కోట్ల వరకు ఖర్చు పెట్టారన్న ప్రచారం నేపథ్యంలో, సినిమా ఐదొందల కోట్లు, ఆ పైన వసూలు చేయడం ఖాయమంటున్నారు. అంత మార్కెట్ రామ్ చరణ్‌కి వుందా.? అంటే, ఇప్పుడే ఏ సమాధానం చెప్పినా తొందరపాటే అవుతుంది.

శంకర్ సినిమాలంటే, బడ్జెట్ అంచనాలకు మించి వుంటుంది. అది సినిమాకి ప్లస్ అవుతుందా.? మైనస్ అవుతుందా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.