గ్లోబల్ లయన్.! బాలయ్య ‘అతి’ వేరే లెవల్.!

ఈ బాలయ్యకి ఏమయ్యింది.? ఏదన్నా పాన్ ఇండియా సినిమా తీసి వుంటే, ‘నేషనల్ లయన్’ అనగలిగేవాళ్ళం. కానీ, ఇప్పుడు ఏకంగా ‘గ్లోబల్ లయన్’ అనేస్తున్నారు.

ఇదంతా, బాలయ్య కావాలనుకుని.. చేయించుకున్నదట. ‘ఏం పెడదాం, బాలయ్య పుట్టినరోజుకి.?’ అన్న చర్చ అనిల్ రావిడిపూడ్ అండ్ టీమ్‌లో జరుగుతున్నప్పుడు, ‘గ్లోబల్ లయన్’ అని పెట్టేయమని బాలయ్యే సూచించాడట.

ఇలాంటి విషయాల్లో బాలయ్య తర్వాతే ఎవరైనా. అన్నట్టు, ‘కింగ్’ అనే పేరుని తనకు తానే పెట్టేసుకున్నాడు అక్కినేని నాగార్జున. ఇప్పుడాయన్ని గ్లోబల్ కింగ్ అనేస్తున్నారు.

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల తర్వాత, అంతా గ్లోబల్ ట్రెండ్ నడుస్తోంది. గ్లోబల్ స్టార్ ఎన్టీయార్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. అలా గ్లోబల్ లయన్ బాలయ్య అన్నమాట. నవ్విపోదురుగాక.. అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి.