సినిమాలేమైపోతాయ్ పవన్ కళ్యాణ్.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం సినిమా షూటింగుల్లో బిజీగా వున్నారు. ‘ఓజీ’ షూటింగ్ ఓ వైపు, ‘బ్రో’ షూటింగ్ ఇంకో వైపు జరుగుతున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊసెక్కడా వినిపించడంలేదు.

‘హరిహర వీరమల్లు’’ అసలు సోదిలోకి లేకుండా పోయిందనుకోండి.. అది వేరే సంగతి. ఇంతకీ, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోతే.. ఈ సినిమాల పరిస్థితి ఏంటట.? జూన్ 14 నుంచి పవన్ కళ్యాణ్ జనంలో వుంటారు.. అదీ ‘వారాహి’ యాత్రలో బిజీ అవుతారు. మరి, తదుపరి సినిమాలకు ఎప్పుడు టైమ్ కేటాయిస్తారు.? గోదావరి జిల్లాల్లో ‘వారాహి’ యాత్ర ఎన్ని రోజులు జరుగుతుందన్నదానిపై స్పష్టత లేదు.

అయితే, అన్ని విషయాలపైనా నిర్మాతలకు పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారని అంటున్నారు. వచ్చే నెలలో మళ్ళీ ఏకధాటిగా సినిమాలు పూర్తి చేసేసి, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లో పవన్ యాక్టివ్ అవుతారన్నది తాజా ఖబర్.