ఓ సంవత్సర కాలంగా అక్కినేని హీరోలు ముగ్గురికి మంచి హిట్ లేదనే చెప్పాలి. గతేడాది చివర్లో నాగార్జున హీరోగా వచ్చిన ది ఘోస్ట్ నుండి ముగ్గురు హీరోలకు అన్ని ఫ్లాపులే. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన ది ఘోస్ట్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. విడుదలకు ముందు కూడా ఏమాత్రం బజ్ క్రియేట్ చేయలేదు. అలాగే విడుదల తర్వాత కూడా ఆకట్టుకోలేక డిజాస్టర్ గా మిగిలిపోయింది.
బంగార్రాజు హిట్ తర్వాత నాగచైతన్య నుండి ‘థాంక్యూ’ వచ్చింది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలకు ముందే అసలు ఏమాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఈ మూవీ బాక్సాఫీప్ వద్ద మొత్తంగా 24 కోట్ల వరకు బిజినెస్ చేసింది. విడుదలై కేవలం 4 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
తాజాగా అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మార్నింగ్ షో నుండే నెగెటివ్ టాక్ అందుకుంది. అఖిల్ ఖాతాలో మరో భారీ డిజాస్టర్ చేరినట్లు రివ్యూలు వచ్చేశాయి. కథా, కథనం ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం, రా వంటి సంస్థలపై మినిమం వర్క్ చేయకపోవడం, బోర్ కొట్టించే లవ్ ట్రాక్, చిరాకు తెప్పించే సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ ఏజెంట్ నిరాశపరిచింది.
ఓ సంవత్సరం నుండి ముగ్గురు అక్కినేని హీరోలకు ఒక్క హిట్టు కూడా లేదు. ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. కొన్ని రోజుల్లోనే నాగచైతన్య నటిస్తున్న కస్టడీ మూవీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ద్వారా అయినా అక్కినేని హీరో ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.