సినీ నటుడు తరుణ్, వెండితెరపై కనిపించి చాన్నాళ్ళే అయ్యింది. ఒకప్పుడు తరుణ్ అంటే, స్టార్ హీరో.! బాల నటుడిగా పలు సినిమాల్లో నటించి, ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరో అయ్యాడు తరుణ్.
ఆర్తి అగర్వాల్, శ్రియ శరణ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు హీరోయిన్లతో తరుణ్ ఎఫైర్ నడిపాడంటూ అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. ఈ లిస్టులో నటి స్నేహ పేరు కూడా వినిపించింది అప్పట్లో.
తాజాగా, తరుణ్ పెళ్ళి గాసిప్స్ వినిపిస్తున్నాయి. అదీ నిహారిక కొణిదెలతో తరుణ్ పెళ్ళనే ప్రచారం కావడం గమనార్హం. తరుణ్ స్పందించాడు, ఆ ప్రచారాన్ని ఖండించాడు. అయితే, ఈ ఖండన ప్రకటన వెనుక పెద్ద కథే నడిచిందట.
తరుణ్‌తో ఆ ప్రకటన ఇప్పించారనీ, సంబంధం లేని విషయంపై తానెందుకు స్పందించాలని తొలుత తటపటాయించినా, ‘పెద్దల ఒత్తిడి’ మేరకు స్పందించాడనీ అంటున్నారు. ఆ పెద్దలెవరబ్బా.?