ఇండస్ట్రీ టాక్ : సోలోగా రానున్న మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య”.?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అలాగే మాస్ మహారాజ రవితేజ కూడా మరో హీరోగా నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి వచ్చే ఏడాది వచ్చే కొన్ని మల్టీ స్టారర్ లలో అయితే ఇది ఒకటి. ఇక ఈ చిత్రం పై భారీ అంచనాలు కూడా నెలకొనగా..

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ అవైటెడ్ సినిమా రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ కాలేదు కానీ సంక్రాంతి పోటీ లో మాత్రం వీరయ్య సోలో గానే ఎలాంటి పోటీ లేకుండా వస్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

ఆల్రెడీ వీరసింహా రెడ్డి జనవరి 12 కి ఫిక్స్ కాగా వీటిలో అయితే వాల్తేరు వీరయ్య జనవరి 13 కి రానున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో ఈరోజు మాత్రం ఏ ఇతర సినిమా కూడా పోటీలో లేనట్టే తెలుస్తుంది. దీనితో ఈ క్రేజీ సినిమా సోలో రిలీజ్ గానే వస్తుంది అని అంటున్నారు.

అలాగే ఈ రిలీజ్ డేట్ పై కూడా అతి త్వరలోనే మాస్ అనౌన్సమెంట్ వస్తుందని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో అయితే హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే దర్శకుడు బాబీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం అందిస్తున్నారు.