బాక్సాఫీస్ దగ్గర “వాల్తేరు వీరయ్య” షాకింగ్ డామినేషన్.!

Waltair-Veerayya

సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి రెండు మాస్ చిత్రాలు పడ్డాయి. అది కూడా ఇద్దరి బిగ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ లు నటించిన వాల్తేరు వీరయ్య మరియు వీరసింహా రెడ్డి చిత్రాలు రిలీజ్ కాగా ఆల్రెడీ వీరసింహా రెడ్డి మొదటి రోజే బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్  లేపింది.

ఇక నెక్స్ట్ డే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య రిలీజ్ కాగా దీనికి ఇంకా వసూళ్లు బయటకి రావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా రెండో రోజు మాత్రం మెగాస్టార్ మాస్ చూపిస్తున్నాడట. రెండో రోజు కూడా తెల్లవారు జామునే షోలు ఉంచగా అనేక చోట్ల అయితే హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

మరి ఇది వీరసింహా రెడ్డి కి సాధ్యం కాలేదు కానీ వాల్తేరు వీరయ్య మాత్రం ఈ షాకింగ్ ఫీట్ సెట్ చేసి పెట్టాడు. దీనితో ఆల్రెడీ వాల్తేరు వీరయ్య డామినేషన్ ఇక మొదలైనట్టే అని చెప్పాలి. దీనితో రెండో రోజు మాత్రం వీరసింహా రెడ్డి కన్నా ఎక్కువ వసూళ్లే వచ్చే ఛాన్స్ కూడా గట్టిగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మాస్ మహారాజ రవితేజ కూడా నటించాడు అలాగే తనకి సరసన క్యాథెరిన్ ట్రెసా నటించింది.