“వాల్తేరు వీరయ్య”లో ఈ సీన్ పూనకాలే..డైరెక్టర్ ప్రామిస్.!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కి రాబోతున్న పలు మాసివ్ ప్రాజెక్ట్ లలో మెగా మాస్ మల్టీ స్టారర్ చిత్రం అయినటువంటి “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ రవితేజ లు నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ అయితే తెరకెక్కిస్తున్నాడు.

ఇక మొదటి నుంచి కూడా మాస్ పూనకాలు లోడింగ్ అంటూ టీజ్ చేస్తూ వస్తున్న దర్శకుడు లేటెస్ట్ గా ఓ క్రేజీ మాస్ పోస్టర్ ని అయితే చిరు పై రిలీజ్ చేసాడు. సినిమాలో లో మెగాస్టార్ మరో అవతార్ అంటూ రివీల్ చేసిన ఈ పోస్టర్ లో మెగాస్టార్ మరింత మాస్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూస్తే ఇదొక మాస్ ఏక్షన్ సీన్ లో ఉన్నట్టుగా కనిపిస్తుండగా మెగాస్టార్ చేతికి సంకెళ్లు చూస్తుంటే మళ్ళీ ఖైదీ తరహా ఏక్షన్ బ్లాక్ చూస్తామేమో అనిపించొచ్చు. ఇక ఈ సీన్ పై అయితే దర్శకుడు పెట్టిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

“ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమే ఈ ఎపిసోడ్ మొత్తం పూనకాలు గ్యారెంటీ” అంటూ ఓ బిగ్ ప్రామిస్ ని అయితే చేసేసాడు. దీనితో ఈ సీన్ పై మరిన్ని అంచనాలు సెట్టయ్యాయి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు అలాగే జనవరి 13న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.