థియేటర్స్ లో మెగా ఫ్యాన్స్ కి పూనకాలే..వీరయ్య సాంగ్ కుమ్మింది.!

టాలీవుడ్ బాసు మెగాస్టార్ చిరంజీవికి రీసెంట్ గానే ఇండియన్ సినిమా దగ్గర ఓ అత్యున్నత పురస్కారం వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా చిరు అయితే తన సినిమాల్లో కూడా మంచి బిజీగా ఉన్నారు. అలా ఇప్పుడు చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “వాల్తేరు వీరయ్య”.

తన ఫ్యాన్ మరియు యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మెగా ఫ్యాన్స్ కి పూనకాలు ఇప్పించే లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి అయితే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సాంగ్ ప్రోమో అయితే బయటకి వచ్చింది.

ఇక చిన్న బిట్ గా ప్లాన్ చేసిన ఈ వీడియోలో అయితే ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బాస్ మాస్ ని మ్యాచ్ చేస్తూ పాడిన లిరిక్స్ అదిరాయి. అలాగే మెగాస్టార్ పక్కా నాటు గెటప్ అన్నీ చూస్తుంటే థియేటర్స్ లో ఈ సాంగ్ కుమ్మే లానే అనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో అయితే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మేకర్స్ నిర్మిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.