బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం ఎదురుచూస్తున్న… యశోద టీజర్ పై స్పందించిన అడివి శేష్!

టాలీవుడ్ అగ్రతారగా ఎంతో పేరు సంపాదించుకున్న సమంత విడాకుల తర్వాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో విభిన్న కథాంశంతో సమంత యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

ఇక ఈ టీజర్ లో సమంత గర్భవతిగా చూపించడమే కాకుండా ఎంతో అమాయకంగా ఉన్నట్టు చూపించారు.ఇకపోతే ఇందులో గర్భవతిగా ఈమె చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ తన జీవితంలో తనకు ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయని అయితే సమంత వాటిని ఎలా ఎదుర్కొంది అనే అంశాలను ఈ సినిమాలో పొందుపరిచారని తెలుస్తుంది. ఇలా టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది.

ఇక ఈ సినిమా టీజర్ పై యంగ్ హీరో అడవి శేషు స్పందించారు. ఈ సందర్భంగా ఈయన సమంత చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ… ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం వేచి ఉండలేకపోతున్నాను సామ్ అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం అడివి శేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ తెలియజేయనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు సమంత ఖుషి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.