వ్యూహం విచారణ నేటికి వాయిదా!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ’వ్యూహం’ సినిమా విడుదలపై విచారణను తెలంగాణ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ సినిమాపై చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌ ను హైకోర్టు ఈరోజు విచారించింది.

ఈ సందర్భంగా సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ తో పాటు రికార్డ్స్‌ ను కోర్టుకు సెన్సార్‌ బోర్డు సమర్పించింది. అయితే సెన్సార్‌ బోర్డు ఇచ్చిన రికార్డులను చూసిన అనంతరం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.