నీ సీక్రెట్‌లు బయటపెడతా.. అలీని బెదిరించిన వివి వినాయక్

మాస్ పల్స్ తెలిసి డైరెక్టర్, మాస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు వివి వినాయక్. వివి వరుస విజయాల వినాయక్ అని పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో అపజయమన్నదే ఎరుగని దర్శకుడిగా స్టార్డం సంపాదించుకున్నాడు. ఎలాంటి కథనైనా మాస్‌ మెచ్చేలా, మాస్‌కు నచ్చేలా తీయడంలో దిట్ట. వివి వినాయక్ చిత్రాలంటే అలీకి ఓ సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుంది. ఆది, సాంబ ఇలా తన మార్క్ కామెడీని చూపించాడు వినాయక్.

VV Vinayak And Ali Funny Conversation In ALi Tho saradaga
VV Vinayak And Ali Funny Conversation In ALi Tho saradaga

అలా వినాయక్‌కు, అలీకి సన్నిహత సంబంధాలున్నాయి. పైగా ఆది సినిమా ఫస్ట్ క్లాప్, ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ క్లాప్ అలీ మీదే కొట్టారట. తాజాగా వినాయక్ అలీతో సరదాగా షోలో అతిథిగా రావడంతో ఈ విషయాలన్నీ వారిద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ మేరకు మామూలుగా అయితే గెస్ట్‌గా వచ్చిన వారి సీక్రెట్‌లను అలీ బయటపెడతాడు. అప్పటికే చేసిన పరిశోధనలతో ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అయితే ఈసారి వెరైటీగా వినాయక్ అలీ పని పట్టాడు.

VV Vinayak And Ali Funny Conversation In ALi Tho saradaga
VV Vinayak And Ali Funny Conversation In ALi Tho saradaga

ఎవ్వరికీ తెలియనీ సీక్రెట్స్ బయటపెడతానని వినాయక్ బెదిరించాడు. నీక్కూడా తెలియని రహస్యాలను చెప్పేస్తా అంటూ వినాయక్ మరీ వేడెక్కించాడు. ఇక అలీ దెబ్బకు బెదిరిపోయి.. అవి మంచివేగా.. నా సంసారంలో నిప్పులు పోయకు.. అసలే ఎపిసోడ్స్ మా ఆవిడ చూస్తుందంటూ వణికిపోయాడు. అయితే ఆ సీక్రెట్స్ ఏంటో తెలియాలంటే వచ్చే వారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.