వితిక షేరు .. యంగ్ హీరో వరుణ్ సందేశ్ భార్యగా ప్రస్తుతం అందరికీ పరిచయమే. అంతేకాదు బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా కూడా వరుణ్ సందేశ్ – వితిక షేరు బాగా పాపులర్ అయ్యారు. పడ్డానండి ప్రేమలో మరి అన్న సినిమాలో వరుణ్ సందేశ్ – వితిక షేరు కలిసి నటించారు. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఇద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం వితిక సినిమాలకి దూరం అయింది. వరుణ్ సందేశ్ కూడా సినిమాలు లేక ఖాళీగానే ఉన్నాడు. ఇక బిగ్ బాస్ తో మళ్ళీ క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట ప్రస్తుతం బిజీగానే ఉన్నారు. వరుణ్ సందేశ్ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నాడు.
ఇక వితిక షేరు ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ అయిన వితిక షేరు రెగ్యులర్ గా నెట్టింట హల్ చల్ చేస్తూ ఏదో ఒక విషయం ప్రేక్షకులతో పంచుకుంటోంది. భర్త వరుణ్ సందేశ్ కనిపించకున్నా వితిక షేరు ఎంటర్‌టైన్మెంట్ షో తో అలాగే ఇంటర్వ్యూలో కనిపిస్తుంది. ఇక తాజాగా వితిక చెల్లి పెళ్లి సందర్బంగా చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వితిక సోషల్ మీడియాలో తన చెల్లి పెళ్లి తనకు డ్రీమ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
నా బంగారు తల్లి.. నీ పెళ్లి గురించి నా పెళ్లి కంటే ఎక్కువ కలలు కన్నాను. అందుకే కష్టపడి చాలా ఇష్టపడి నీ పెళ్లి చేశాను. నువ్వు నా చెల్లిలా పుట్టావు కాని నేను నిన్ను తల్లిలా పెంచుకున్నాను. నీ పెళ్లి నా 20 ఏళ్ల కల. ఇప్పుడు ఆ కల నెరవేరడంతో చాలా గర్వంగా ఉంది. నీకు జీవితంలో ఎప్పుడు అండగా నేను ఉంటూనే ఉంటాను. నీవు కొత్త ఇంటి వారితో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐలవ్ యూ ఇకపై నువ్వు నన్ను మరింత గర్వపడేలా చేస్తావని ఆశిస్తున్నాను.. అంటూ చెల్లి సందర్బంగా ఇన్ స్టా లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది వితిక. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.