విఠల్ వాడి రివ్యూ, రేటింగ్!

vithalwadi movie

నటీనటులు: రోహిత్ రెడ్డి, కేశ రౌత్, చమ్మక్ చంద్ర, అప్పాజీ అంబరీష తదితరులు
కెమెరామెన్: సతీష్ అడప
మ్యూజిక్: రోషన్ సాలూర్
దర్శకత్వం: టి.నాగేంద్ర
నిర్మాత: గుడిపాటి నరేష్ కుమార్

ఎన్.ఎన్. ఎస్ప్రీరియన్స్ ఫిలింస్ బ్యానర్ పై జి.నరేష్ కుమార్ నిర్మాతగా టి.నాగేంద్ర దర్శకత్వంలో రోహిత్ రెడ్డి హీరోగా కేశ రౌత్ హీరోయిన్ గా నటించిన సినిమా విఠల్ వాడి. ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
(రోహిత్ రెడ్డి) చందు విఠల్ వాడి ఏరియాలో ఒక గ్యారేజ్ రన్ చేస్తూ ఉంటాడు. ఆ ఏరియాలో ఉన్న వారందరూ చందును అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో చందు ఒకరోజు అనుకోకుండా
జాను (కేశ రావత్) ను చూసి ప్రేమిస్తాడు. ఒక సందర్భంలో చందు తనకు జాను కరెక్ట్ కాదని అనుకోని తనకు దూరమవుతాడు. ఈ సమయంలో చందు తలకు దెబ్బ తగిలి తన గతం మర్చిపోతాడు. మరి తరువాత ఏం జరిగింది ? జానును చందు కలుస్తాడా ? చందుకు గతం గుర్తు వచ్చిందా ? తెలుసుకోవాలంటే విట్ఠల్ వాడి సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
నూతన నటుడిగా పరిచయం అయిన రోహిత్ బాగా నటించాడు. సెకంగా హాఫ్ లో గతం మర్చిపోయిన అబ్బాయి గా అద్భుతమైన నటనను కనబరిచాడు. కేశ రౌత్ తన నటనతోనే కాకుండా అందంతో ఆకర్శించింది. డైరెక్టర్ టి. నాగేంద్ర కుమార్ ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాను తీసాడు. తనకిది ఫస్ట్ ఫిలిం అయినా సరే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను నడిపించాడు. రోషన్ కోటి సంగీతంతో పాటు నేపధ్య సంగీతం అద్భుతంగా అందించాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో అప్పాజీ అంబరీష బాగా నటించాడు. చమ్మక్ చంద్ర కామెడీ ట్రాక్ బాగుంది. సతీష్ అడేప కెమెరా వర్క్ నీట్ గా ఉంది.

నిర్మాత జి.నరేష్ కుమార్ రెడ్డి ఎక్కడా కాంప్రమేజ్ కాకుండా సినిమాను నిర్మించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా విషయానికి వస్తే ఒక ఏరియాలో జరిగే ప్రేమ కథను అందంగా తెరమీద చూడొచ్చు. నిజమైన ప్రేమ అంటే ఇలానే ఉంటుంది అనే విధంగా ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ పాత్రలు ఉండడం విశేషం. యువతకు కావాల్సిన అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంది.

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద సక్సెస్ అవుతాయి. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన విఠల్ వాడి సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చెయ్యొచ్చు. ఒక మంచి సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నాయి. ప్రేమ గురించి హీరో చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టొరీ చూడాలనుకున్న ప్రేక్షకులు విఠల్ వాడి సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.

చివరిగా: విఠల్ వాడి ఒక స్వచ్ఛమైన ప్రేమకథ

రేటింగ్: 3/5