‘విశ్వంభర’ కోసం రామోజీలో సెట్‌!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘విశ్వంభర’. పాన్‌ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిష దాదాపు 18 ఏండ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఇందులో నటిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ షూటింగ్‌ సంబంధించి ఒక సాలిడ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ సెట్‌ను వేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ సెట్‌లో మెగాస్టార్‌తో పాటు విలన్స్‌పై భారీ యాక్షన్‌ సీన్స్‌ ను షూట్‌ చేయనున్నట్లు టాక్‌. అయితే ఈ సీక్వెన్స్‌లో చిరంజీవి గెటప్‌ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని యాక్షన్‌ విజువల్స్‌గా కూడా గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయని తెలుస్తుంది. ఇక ఇదే గనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్‌కు చాలా రోజుల తర్వాత ఫుల్‌ మీల్స్‌ అని చెప్పాలి.

ఇక ఈ మూవీ సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండగా యువీ క్రియేషన్స్‌ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో బ్జడెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.