బాలయ్యతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న విశ్వక్ సేన్.!

జై బాలయ్య.. అనే మాట విశ్వక్ సేన్ నోట వస్తే ఎలా వుంటుంది. అది వేరే లెవల్ కదా.! ఆ లెవల్‌ని త్వరలో అందుకునేందుకు మనోడు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అవునండీ.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బాలయ్యకి వీరాభిమాని అట. తన అభిమానాన్ని ఉత్తనే చాటుకోవడం కాదు.. బాలయ్యతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

స్వతహాగా మనోడు డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ తన డైరెక్షన్‌లో ‘ధమ్కీ’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడీ యంగ్‌స్టర్. ఇదే హుషారులో బాలయ్యతో ఓ సినిమా తీయాలనుకుంటున్నాడట సొంత డైరెక్షన్‌లో. అందుకు కథ కూడా సిద్ధంగా వుందని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

ఈ సినిమాని సొంత డైరెక్షన్‌లో సొంత నిర్మాణంలో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడట విశ్వక్ సేన్. ఇదంతా ‘ధమ్కీ’ హిట్ అయితేనే.. అనుకోండి. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతో.!