పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో విశ్వక్ సేన్ మూవీ?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో చాలా కథలు వస్తున్నాయి. వాస్తవ కథలని సినిమాటిక్ ఫీల్ తో సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అవుతాయని దర్శకుల నమ్మకం. అందుకే పీరియాడిక్ టచ్ లో రియల్ లైఫ్ సంఘటనలతో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నారు. తాజాగా వచ్చిన దసరా మూవీ కూడా రియల్ లైఫ్ సంఘటనలతోనే చేసిన చిత్రం.

అలాగే ది కేరళ స్టొరీ మూవీ రియల్ సంఘటనల స్ఫూర్తితోనే చేశారు. ఇక టాలీవుడ్ లో చాలా మంది దర్శక, నిర్మాతలు పీరియాడిక్ జోనర్ కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది అయితే బయోపిక్ లని తెరపై అనధికారికంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కథతోనే విశ్వక్ సేన్ 11వ చిత్రం రాబోతోందని తెలుస్తోంది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా లాంచ్ చేశారు. ఇందులో రఫ్ లుక్ లో గళ్ళచొక్కా వేసుకొని లుంగీ కట్టుకొని నోట్లో సగం కాల్చిన సిగరెట్ పెట్టుకొని మాస్ అవతార్ లో విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసిన తర్వాత ఇదొక మాస్ యాక్షన్ చిత్రం అయ్యి ఉంటుందని అందరూ భావించారు.

అయితే నిజానికి ఇదొక పొలిటికల్ లీడర్ బయోపిక్ అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మాస్ లీడర్ కథని తెరపై అనధికారికంగా ఆవిష్కరిస్తున్నారంట. ఎప్పుడు వివాదాలతో సహవాసం చేసే ఆ నాయకుడు నిత్యం తన మాటలతో వార్తల్లో కూడా ఉండే వ్యక్తి అని తెలుస్తోంది మాస్ లీడర్ గా అతను ఎదిగిన విధానం సినిమాలో చూపిస్తరంటా.

నిజానికి ఈ కథని నారా రోహిత్ చేద్దామని అనుకున్నారంట. అయితే విశ్వక్ సేన్ అయితే అందరికి భాగా రీచ్ అవుతుందని భావించి దర్శకుడు కృష్ణ చైతన్య అతనితో చేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ జోనర్ లోనే తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇంతకి ఈ లీడర్ కి సంబంధించిన బయోపిక్ అనేది తెలియాల్సి ఉంది.