మెగా వారింట సంబురాల హంగామా కొనసాగుతుంది. శ్రీజ పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీలో మళ్ళీ పండుగ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో నిహారిక, చైతన్య పెళ్లి వేడుక జరగనుండగా, ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లికి మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఊపందుకున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఓ చోట చేరి సందడి చేస్తున్నారు. అంతేకాదు హంగామాకి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి.
ఓ వైపు నిహారిక పెళ్లి హంగామా కొనసాగుతుండగా, మరోవైపు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన భర్త విష్ణు ప్రసాద్ బర్త్‌డే వేడుకలని ఘనంగా జరుపుకొచ్చింది.ఈ వేడుకకు కాబోయే దంపతులు నిహారిక, చైతన్య హాజరై విష్ణు ప్రసాద్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. వేడుకకి సంబంధించిన ఫొటోలని సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఇవి వైరల్ అవుతున్నాయి. సుస్మిత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఓల్డ్ స్టూడెంట్. ఆ అనుభవంతోనే తండ్రి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ఖైదీ నెంబర్ 150 చిత్రంలో చిరు డ్రెస్సింగ్‌కు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు.
ఇక ఇదిలా ఉంటే సుస్మిత ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి ఈ బేనర్‌పై తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి వైవిధ్యమైన ప్రాజెక్టులు చేసేందుకు సిద్ధమయింది. ముందుగా ఎక్స్ చేంజ్ ఆఫ్ ఫైర్ టైటిల్‌తో వెబ్ సిరీస్ రూపొందించే ప్లాన్ చేయగా, కొద్ది రోజుల క్రితం దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ని ఓయ్ ఫేం ఆనంద్ రంగా తెరకెక్కిస్తున్నారు. కాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జీ5 యాప్‌లో ప్రసారం కానుంది.