ప్రముఖ నటుడు నిర్మాత అయిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే తెలియని వారు ఉండరు. తన అద్భుతమైన డైలాగులతో డైలాగ్ కింగ్ అని పేరు పొందాడు. స్వర్గం నరకం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన ఆయన ఆ తర్వాత తన నటనతో అందరిని మెప్పించాడు. ఆయన దాదాపు 560 కు పైగా సినిమాల్లో నటించాడు. 75 సినిమాలను నిర్మించాడు. తను చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తీసుకురావడంతో కలెక్షన్ కింగ్ అని పేరు పొందాడు. నటుడిగా ఏంటో ప్రజాదరణ పొందాడు.
ఈ విధంగా కొంత కాలం రాజ్య సభ లో సభ్యునిగా పని చేశాడు. మోహన్ బాబు 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్థాపించాడు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది.
ఆయనకు ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్ మంచు ఒక కుమార్తె మంచు లక్ష్మి వీరు కూడా చలన చిత్ర నటులు. అయితే ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన జిన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో విష్ణు, పాయల్ రాజ్ పుత్, మరియు సన్నీలియోన్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమా అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఇషాన్ సూర్య దర్శకత్వంలో వచ్చింది. ఈ చిత్రం అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీల సంస్థలను సమైక్యంగా నిర్మించారు.
అనుప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు.
ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు సహా పలు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ..తన కుమారుడు, విష్ణు చెప్పిన మాటలకు నేను ఆశ్చర్య పోయాను. 50 ఏళ్ల నా నటన జీవితం లో ఎవరు నన్ను అలా అనలేదు. ఆదివారం జరిగిన జిన్నా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు వ్యాఖ్యాలు ను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ. తన 50 ఏళ్ల నటన జీవితంలో ఎప్పుడు నన్ను ఇలా అనలేదు.
మా అన్న గారు ఎన్టీఆర్ గాని ఎఎన్నార్ గాని కృష్ణ గాని ఏ సినిమా ఫంక్షన్ లో కూడా నన్ను అలా అనలేదు. కానీ నా కుమారుడు విష్ణు చెప్పాడు. అంత పెద్ద వాళ్లే కొన్ని నిమిషాలు మాట్లాడమని చెప్పలేదు. కానీ అలాంటిది విష్ణు చెప్పింటే షాక్ అయ్యాను.అంటే నేను వేదికపై ఇంతసేపు మాట్లాడుతాన..? అనిపించింది అని ఆయన అన్నాడు. ఇక అలాగే ఎక్కువగా జిన్నా సినిమా కోసం విష్ణు చాలా కష్టపడ్డాడని ఇప్పటికీ ఏ సినిమాలో చేయని రిస్క్ చేశాడంటూ కుమారుడు విష్ణును ను పై ప్రశంసలు కురిపించారు మోహన్ బాబు.