మొదటిసారి సీబీఐ విచారణకి హాజరైన ప్రముఖ హీరో ఏమంటున్నాడంటే

గత కొన్నాళ్ల కితం సౌత్ ఇండియా సినిమా దగ్గర వినాయక చవితి కానుకగా రిలీజ్ కి వచ్చిన సినిమాల్లో తమిళ యంగ్ స్టార్ నటుడు విశాల్ హీరోగా నటించిన సినిమా “మార్క్ ఆంటోనీ” కూడా ఒకటి. అయితే ఈ సినిమాకి విశాల్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించగా ఈ విషయంలో హిందీ డబ్బింగ్ చేసి నార్త్ లో కూడా తాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

కానీ అనుకోని విధంగా ఈ సినిమా సెన్సార్ చేసేందుకు బాలీవుడ్ సెన్సార్ యూనిట్ నన్ను లంచం అడిగారు అని సినిమాల్లోనే అనుకుంటే నిజ జీవితంలో ఇలా తనకి అవినీతి ఎదురు కావడం చాలా బాధ కలిగించింది అని దీనిపై ఎంతవరకు అయినా పోరాటం చేస్తానని తెలిపాడు.

అయితే ఇప్పుడు ఆ కేసు విషయం విచారణకి వచ్చింది. కాగా తాను మొట్టమొదటి సారిగా సిబిఐ ఆఫీస్ కి వెళ్తున్నాను అని తెలిపి ఆ విచారణ అనంతరం కూడా తన స్పందనను తెలిపాడు. సిబిఐ ఆఫీస్ అంటే ఇలా ఉంటుంది అని మొదటి సారి తాను చూశానని వారి నుంచి కొన్ని సూచనలు సలహాలు కూడా తీసుకున్నాను అని.

అంతే కాకుండా ఈ విచారణ ప్రాసెస్ అంతా కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది అని విశాల్ తెలిపాడు. అలాగే నా సినిమా జీవితంలోనే కాదు నిజ జీవితంలో కూడా అవినీతి విషయంలో వెనకడుగు వేసేది లేదు అని చివరి మాటగా విశాల్ తెలిపాడు. దీనితో విశాల్ ప్రకటన తమిళ నాట వైరల్ గా మారింది.