హిట్స్ ఇచ్చిన డైరెక్టర్.. 7 ఏళ్ళ తరువాత ఇలా..

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో యువ దర్శకుల ప్రహసనం ఎక్కువ అయ్యింది. కొత్త కొత్త దర్శకులు తమ టాలెంట్ గా సూపర్ సక్సెస్ లు అందుకొని దూసుకుపోతున్నారు. అయితే కొంత మంది యంగ్ దర్శకులు మాత్రం చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. వారిలో తరుణ్ భాస్కర్ పేరు టాప్ లో ఉంటుంది. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి 7 ఏళ్ళు అవుతుంది.

దర్శకుడిగా చేసినవి రెండే సినిమాలు. నెక్స్ట్ వెంకటేష్ మహా కూడా ఉన్నారు. దర్శకుడిగా అడుగుపెట్టి 5 ఏళ్ళు అవుతోంది. చేసినవి రెండే సినిమాలు అలాగే విరంచి వర్మ పేరు కూడా కచ్చితంగా చెప్పుకోవాలి. ఉయ్యాలా జంపాల సినిమాతో దర్శకుడిగా 2013లో కెరియర్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకొని నానితో మజ్ను సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అయినా కూడా 3వ సినిమా కోసం సుదీర్గ గ్యాప్ తీసుకున్నాడు. ఏకంగా 7 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో సినిమాని ఒకే చేయించుకున్నాడు. ఇక ఈ సినిమా అఫీషియల్ గా ఎనౌన్స్ కాకున్నా విరంచి వర్మ కళ్యాణ్ రామ్ కి కథ కూడా చెప్పడం జరిగిందనే మాట వినిపిస్తోంది.

ఇక ఈ మూవీని విరంచి వర్మ ఈ సరి భారీ బడ్జెట్ తో పీరియాడిక్ జోనర్ లో ట్రై చేయబోతున్నారని టాక్. గ్రాండ్ స్కేల్ పై ఈ సినిమాని ఆవిష్కరించడానికి రెడీ అవుతోన్నట్లు గా తెలుస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. ఇదిలా ఉంటే ఏడేళ్ళ గ్యాప్ తర్వాత విరంచి వర్మ చేస్తోన్న సినిమా కాబట్టి దీనిపై పెర్ఫెక్ట్ వర్క్ చేసుకొని దిగుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల మాట.

కళ్యాణ్ రామ్ కూడా ఈ మధ్య తన సినిమాలని గ్రాండ్ స్కేల్ లోనే ఆవిష్కరిస్తున్నారు. బింబిసారని సోషియో ఫాంటసీ చిత్రంగా చేశారు. తరువాత అమిగోస్ తో డిఫరెంట్ జోనర్, డిఫరెంట్ కాన్సెప్ట్ ని ట్రై చేశారు. ప్రస్తుతం డెవిల్ టైటిల్ తో పీరియాడికల్ యాక్షన్ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వంలో చేస్తోన్నారు. దీని తర్వాత విరంచి వర్మ పీరియాడికల్ డ్రామా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.