వైరల్ : తన గుర్తింపు పోగొట్టుకున్న మహేష్.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర భారీ స్టార్డం ఉన్న హీరోస్ లో ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకడు. మరి మహేష్ బాబు అయితే హీరోగా ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ తో ఐతే “గుంటూరు కారం” అనే సినిమా కూడా ఇప్పుడు చేస్తున్నాడు.

కాగా ఈ సినిమా షూట్ ఇప్పుడు మరి కాసేపు వాయిదా పడగా మహేష్ బాబు కి ఆఫ్ లైన్ తో పాటుగా సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మహేష్ బాబు తన గుర్తింపు పోగొట్టుకున్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఎంత గందరగోళం జరుగుతుందో తెలిసిందే.

కాగా గత కొన్నాళ్ల కితం చాలా మంది ప్రముఖులు తన వెరిఫికేషన్ టిక్ మార్క్స్ పోగొట్టుకున్నారు. అయితే ఇది ఇష్యూ గా మారడంతో 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్న వారు అందరికీ కూడా టిక్ మార్క్స్ ని ఫ్రీ గా ఇస్తున్నట్టుగా ట్విట్టర్ తెలిపింది. దీనితో మళ్ళీ అవన్నీ పోగొట్టుకున్న సెలెబ్రేటిస్ కి వచ్చాయి.

అయితే ట్విట్టర్ లో ఏ టాలీవుడ్ స్టార్ కి గాని సౌత్ హీరోకి గాని లేని భారీ ఫాలోవర్స్ 13 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ మహేష్ కి ఉన్నారు. అయినప్పటికీ కూడా మహేష్ ఇప్పుడు తన టిక్ మార్క్ పోగొట్టుకోవడం వైరల్ గా మారింది. సడెన్ గా చూసిన మహేష్ ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్నారు. మరి 13 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్న మహేష్ కి కూడా ఎందుకు తన గుర్తింపు పోయిందో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.