వైరల్ : “అవతార్ 2” లేటెస్ట్ రిలీజ్ టీజర్ చూసారా.?

ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “అవతార్ 2”. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఓపెనింగ్స్ ఏ లెవెల్లో ఉంటాయో ఎంత లాస్ట్ రన్ లో ఆగుతాయో అని దర్శకుడు జేమ్స్ క్యామెరాన్ అద్భుత సృష్టి చూసేందుకు బాగా ఎగ్జైటెడ్ గా అయితే ఉన్నారు.

మరి ఈ చిత్రం ఈ డిసెంబర్ 16న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఈ సినిమా నెవెర్ బిఫోర్ హాలీవుడ్ సినిమా రిలీజ్ గా రాబోతుంది. మరి ఈ చిత్రం అయితే రిలీజ్ కి దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ భారీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

అలాగే లేటెస్ట్ గా ఓ అదిరిపోయే రిలీజ్ టీజర్ ని అయితే రిలీజ్ చేశారు. మరి ఇందులో చాలా బలమైన ఎమోషన్స్ సహా సరికొత్త విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనితో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయని చెప్పొచ్చు. అవతార్ ల కొత్త ఫ్యామిలీ అందులోని స్టన్నింగ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తున్నాయి.

ముఖ్యంగా 3డి లో చూసినట్టు అయితే ఇది మరింత గ్రాండ్ గా ఉండేలా అనిపిస్తుంది. ఇక ఈ బిగ్గెస్ట్ వండర్ లో అయితే కేట్ విన్స్లెట్, సహా మరెంతోమంది స్టార్స్ నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 16న రిలీజ్ కాబోతుంది.
Avatar: The Way of Water | Nothing Is Lost