పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సీతమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ ఈ మూవీలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ్ హిట్ మూవీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 30 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో దర్శకుడు సముద్రఖని గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నారు. మార్చి నెల ఆఖరు లోపు పవన్ కళ్యాణ్ పోర్షన్ మొత్తం కంప్లీట్ చేయడానికి రంగం సిద్ధం చేశాడు.
పవన్ కళ్యాణ్, తేజ్ కాంబినేషన్ లో సన్నివేశాలు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ మూవీలో సాయి తేజ్ కి జోడీగా కేతిక శర్మ హీరోయిన్ గా ఖరారు అయినట్లు తెలుస్తుంది. మిగిలిన పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోహిణి నటిస్తుంది. అలాగే తనికెళ్ళ భరణి నటిస్తున్నాడు. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం ఈ మూవీలో కమెడియన్ గా అలరించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక సుబ్బరాజు, రాజా చెంబోలు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రియా ప్రకాశ్ వారియర్ కనిపించబోతూ ఉండటం విశేషం. తెలుగులో ఈమెకి ఇదే రెండో సినిమా కావడం అది కూడా పవర్ స్టార్, తేజ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ లో నటించే ఛాన్స్ రావడం నిజంగా ప్రత్యేకం అని చెప్పాలి. ప్రస్తుతం క్యాస్టింగ్ లో ఉన్న నటీనటులు అందరూ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి ఆగస్టు 15న విడుదల చేయాలని దర్శకుడు సముద్రఖని ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ లో హిట్ మూవీ కావడంతో కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ మూవీ రీచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇక మార్చి నెల ఆఖరుకి వినోదాయ సీతమ్ షూటింగ్ కి పవన్ కళ్యాణ్ ప్యాకప్ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. తరువాత సుజిత్ దర్శకత్వంలో ఓజీని మార్చిలోనే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.