మెగాస్టార్ ఆచార్య మిస్ అయిన త్రిష కి వినాయక్ బంపర్ ఆఫర్ ..?

కోలీవుడ్ లో 96 సినిమాకి ముందు త్రిష కి కాస్త గ్యాప్ వచ్చింది. ఇటు తెలుగులోను అవకాశాలు రాలేదు. దాంతో ఇక త్రిష సినిమా కెరీర్ క్లోజ్ అయినట్టే అని మాట్లాడుకున్నారు. స్టార్ హీరోయిన్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా కొనసాగుతోంది. ఒకానొక దశలో తెలుగు తమిళ సినిమాలలో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా త్రిష హాట్ టాపిక్ గా మారింది. అయితే పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళ హవా బాగా కొనసాగుతుండటంతో త్రిష కి అవకాశాలు తగ్గిపోయాయి.

అయితే అనూహ్యంగా 96 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మళ్ళీ ఫాంలోకి వచ్చింది త్రిష. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య లో అవకాశం వచ్చింది. సీనియర్ హీరోలకి మంచి ఛాయిస్ కావడం తో ఆచార్య త్రిష కి మంచి అవకాశం అని అందరూ భావించారు. దాదాపు సెట్స్ మీద కి వెళ్ళ బోతున్న సమయంలో ఆచార్య సినిమా నుంచి త్రిష తప్పుకుందన్న వార్తలు వచ్చాయి. అందుకు కారణం పెద్దగా తెలియనప్పటికి స్టాలిన్ లో మెగాస్టార్ తో త్రిష నటించగా ఆ సినిమా ఫ్లాప్ సినిమాగా మిగిలింది. ఇదే కారణం అని అందరూ అనుకున్నారు.

ఆ తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 లో నటించిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని మేకర్స్ ఫైనల్ చేసుకున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ తో నచించే ఛాన్స్ అప్పుడు మిస్ అయినప్పటికి మరోసారి లూసీఫర్ తెలుగు రీమేక్ ద్వారా అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో త్రిష.. రవితేజ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణ సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందుకే ఇప్పుడు మెగాస్టార్ నటించబోతున్న లూసీఫర్ రీమేక్ లో వినాయక్ త్రిష ని తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. చూడాలి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో.