వైరల్ : “24” మూవీ పార్ట్ 2 పై అదిరే అప్డేట్స్ ఇచ్చిన దర్శకుడు..!

ఇండియన్ సినిమా దగ్గర వచ్చినటువంటి కొన్ని యూనిక్ కాన్సెప్ట్ సినిమాల్లో టైం ట్రావెల్ పై చాలా తక్కువే కనిపిస్తాయి. మరి అలాంటి తక్కువగా వచ్చిన సినిమాల్లో సాలిడ్ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే చిత్రాల్లో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం “24” కూడా ఒకటి.

గత 2016 లో అలా వచ్చిన ఈ సినిమా సౌత్ ఇండియా సినిమా దగ్గరే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా అప్పటిలో హాట్ టాపిక్ అయ్యి ఒక బెస్ట్ టైం ట్రావెల్ సినిమాగా కూడా నిలిచింది. అయితే ఈ సినిమాపై సీక్వెల్ కోసం ఎప్పుడు నుంచో చాలా మంది ఆసక్తిగా చూస్తుండగా ఇప్పుడు దర్శకుడు నేరుగా ఓపెన్ అయ్యారు.

తమ కాంబోలో 24 కి పార్ట్ 2 ఉందని అయితే అది ఇప్పుడప్పుడే రాదనీ క్లారిటీ ఇచ్చారు. దీనితో పాటుగా ఇప్పుడు కొన్ని పేజీలు వరకు స్క్రిప్ట్ పూర్తి కాగా మిగతా కథ పూర్తి కావాల్సి ఉందని అలాగే సూర్య చేసిన ఆత్రేయ రోల్ ని కూడా ఎలా తీసుకురావాలి అనేది కూడా వర్కింగ్ లో ఉందని..

ఇవన్నీ సెట్ అయితే మరో మూడేళ్ళలో ఈ సినిమా స్టార్ట్ అవ్వొచ్చని అన్నారు. ఇక ప్రస్తుతం అయితే తనకు నాగ చైతన్యతో చేసిన సినిమా థ్యాంక్ యూ రిలీజ్ కి సిద్ధంగా ఉండగా తర్వాత ఇదే కాంబోలో దూత అంటే హర్రర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది.