Vijay: యాక్షన్ తో అదరగొడుతున్న విజయ్ బీస్ట్ సినిమా ట్రైలర్..!

Vijay: తమిళ్ సినిమా హీరో దళపతి విజయ్ వరుస సినిమా విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.ఇటీవల వచ్చిన విజయ్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం విజయ్ హీరోగా వస్తున్న బీస్ట్ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.నెల్సన్ దిలీప్ ఇది వరకే డాక్టర్ వంటి సినిమా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. అందుకే ఈ సినిమా మీద అంచనాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడం మరొక విశేషం.

ఏప్రిల్ 13న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి అన్నీ కుదిరితే ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన హలమితి హబిబో ఈ పాట ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఇక సినిమా నుంచి వచ్చిన రెండో పాట జాలీ ఓ జింఖానా కూడా అదరగొట్టేసింది. తాజాగా సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఉగాది పర్వదినాన విడుదల చేశారు చిత్ర బృందం.

YouTube video player

ట్రైలర్ ను బట్టి ఈ సినిమాలో విజయ్ స్పై ఏజెంట్ రాఘవన్ గా కనిపించనున్నారు.బీస్ట్ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివరన చెప్పే డైలాగ్ ట్రైలర్ కె హైలెట్ గా నిలిచింది. విజయ్ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇక ట్రైలర్ లోని కథ విషయానికి వస్తే..ఒక మాల్ లో టెర్రరిస్టులు హైజాక్ చేయగా అదే మాల్ లో విజయ్, పూజా హెగ్డే కూడా ఉంటారు. ఇక విజయ్ ఉగ్రవాదుల నుంచి వారిని ఎలా కాపాడుతారు .. మిషన్ ఎలా పూర్తి చేస్తాడో తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇందులో డైరెక్టర్ సెల్వరాఘవన్, యోగి బాబు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్ లో పూజా హెగ్డే కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వ లేనట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం భారీ యాక్షన్ స్థాయిలో చాలా టైల్స్ డిజైన్ గా చేయబడినట్లు కనిపిస్తోంది.