Beast : బీస్ట్ లో పోకిరి డైలాగ్ లు ఫాలో అయిన హీరో విజయ్..!

Beast : తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు.తమిళ్ లో నే కాదు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల ముందు చాలా క్రేజ్ వుంది.విశేషం ఏంటంటే ఈ సినిమాకు తమిళ్ కన్నా కూడా తెలుగు లో అందులోను తెలంగాణ లో సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా వున్నాయ్.ఏప్రిల్ 13 నా ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. కాకపోతే విడుదల అయినా రోజు నే కాస్త నెగిటివ్ టాక్ తో వెళ్తోంది.

ఈ సినిమా మీద ఇంత అంచనాలు ఉండటానికి కారణం బీస్ట్ ఫస్ట్ సింగిల్ అయిన ‘అరబిక్ కుత్తు’ కూడా చార్ట్ బస్టర్ అవ్వడం, ‘బీస్ట్’ దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన ‘డాక్టర్’ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ‘బీస్ట్’ పై అంచనాలు తారస్థాయికి చేరాయి.అయితే తాజాగా ఈ సినిమాలోని కొన్ని డైలాగ్ ల మీద, హీరో నటన మీద కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏంటంటే ఈ సినిమాలో విజయ్ యాక్షన్ కొద్దిగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటన తో పాలిస్తున్నారు అభిమానులు.

అంతే కాదు ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే డైలాగ్ ను బీస్ట్ లో విజయ్ రెండు, మూడు సార్లు వాడతాడు. దాంతో ఇప్పుడు డిస్కషన్లు ఎక్కువయ్యాయి.అసలు విషయం ఏంటంటే హీరో మహేష్ పోకిరి సినిమాని విజయ్ తమిళ్ లో రీమేక్ చేయడం జరిగింది.కాబట్టి ఈ డైలాగ్ తమిళ్ రీమేక్ పోకిరి లో కూడా వుంది.తన డైలాగ్ ను తనే కాపీ కొట్టుకున్నాడు అని కొందరు విశ్లేషిస్తున్నారు.