బాలీవుడ్ బడా స్టార్ తో విజయ్ సేతుపతి

Vijay Sethupathi is all set to star in a Bollywood web series

విజయ్ సేతుపతి షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా టాప్ లిస్ట్ లో కి చేరాడు.సేతుపతి ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా వస్తున్న “మాస్టర్ ” చిత్రంలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తమిళ్ లో ఆయన వరసగా మమనిథన్, యతుమ్ యురే యవరుమ్ కెలిర్ మరియు తుగ్లక్ దర్బార్ వంటి చిత్రాలు కూడా చేస్తున్నాడు. ఈ నటుడు తెలుగులో మెగా హీరో వైష్ణవ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’లో విలన్ గా నటించాడు. ఈ మూవీ కూడా విడుదలకి సిద్దమవుతుంది. గతంలో అమీర్ ఖాన్’తో కలిసి ‘లాల్ సింగ్ చడ్డా’లో సేతుపతి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఏవో కారణాల వల్ల అతను ఈ చిత్రం నుండి తప్పుకున్నారని సమాచారం.

Vijay Sethupathi is all set to star in a Bollywood web series
Vijay Setupathi is all set to star in a Bollywood web series

తాజాగా సేతుపతి గురించి ఒక ఆసక్తికరమైన వార్త సంచలనంగా మారింది.ఏమిటంటే… అతను త్వరలో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. తమిళ్ లో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి త్వరలో బాలీవుడ్‌ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్‌తో కలిసి ప్రేక్షకులని ఆకట్టుకోబోతున్నాడట.ఈ కొత్త వెబ్ సిరీస్ షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందని, ‘ఫ్యామిలీ మ్యాన్’ చేసిన రాజ్ & డికె ఈ మల్టీ-ఎపిసోడ్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. విజయ్ సేతుపతిని ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో చూడబోతున్నారని మేకర్స్ హామీ ఇచ్చారు.దేశవ్యాప్తంగా OTT ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలవబోతున్న ఈ వెబ్ సిరీస్ గురించి అతని అభిమానులు మరియు ఆరాధకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.