క్రేజీ : విజయ్ పాడిన పాటకి మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.!

తమిళ నాట స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా వరిసు తెలుగులో వారసుడు అనే టైటిల్ తో చిత్ర యూనిట్ తెలుగులో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ ఇప్పుడు తమిళ్ లో శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ప్రాపర్ తమిళ్ సినిమా లానే దీనిని ప్లాన్ చేస్తూ తెలుగులో గ్రాండ్ రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు ప్లాన్ చేస్తుండగా సినిమాపై అంచనాలు మాత్రం మరింత పీక్స్ లోకి వెళ్తున్నాయి.

విజయ్ నటించిన సినిమాలు పాటలు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ లు అందుకుంటాయి. అలాగే ఈసారి కూడా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అందులోని విజయ్ స్వయంగా పాడిన “రంజితమే” సాంగ్ రిలీజ్ అయ్యి మొదటి రోజే భారీ స్పందనను అందుకోగా ఇప్పుడు ఏకంగా 50 మిలియన్ వ్యూస్ ని ఈ సాంగ్ సొంతం చేసుకొని విజయ్ ఖాతాలో మరో రికార్డులా మారింది.

మరి సంగీత దర్శకుడు థమన్ సమకూర్చిన ఈ సాంగ్ అంచనాలు అందుకోవడంతో ఈ సాంగ్ క్రేజీ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇంకా ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మికా మందన్నా నటించగా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే దిల్ రాజు ఈ సినిమాని స్పెషల్ కేర్ తీసుకొని రిలీజ్ ప్లాన్ లు చేస్తున్నాడు.