కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న టాప్ హీరోల్లో ఒకరని మరోసారి ఋజువయ్యింది. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్టార్ హీరో తన మార్కెట్ ను.కొంచెం కొంచెంగా పెంచుకుంటున్నాడు. మొత్తానికి సినిమా సాలీడ్ ఓపెనింగ్స్ తో నిర్మాతల్లో ఒక ధైర్యాన్ని అయితే నింపింది.
అయితే మొదట రోజే నెగిటివ్ రివ్యూలు కాస్త ఆందోళన కలిగించాయి. సినిమా దాదాపు ప్లాప్ టాక్ ఆమె విధంగా కథనాలు వెలువడ్డాయి. విమర్శలు చేసిన వారికి విజయ్ కలెక్షన్స్ తోనే దెబ్బ కొట్టడు. బీ హ్యాపీ అన్నట్లుగా సినిమా కలెక్షన్స్ చాలా వేగంగా వంద కోట్లను దాటేసింది. 6వ రోజు కలెక్షన్స్ తో మొత్తం రూ.150కోట్లు వచ్చాయి. కేవలం 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచినప్పటికి కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు.
ఇంకాస్త పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే రికార్డులు మరో లెవెల్లో ఉండేవి. ఇక మొత్తానికి విజయ్ కెరీర్ లో మాస్టర్ మరో బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఆల్ మోస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో కాస్త హవా తగ్గినప్పటికీ తమిళ్ లో మాత్రం అదే జోరు కొనసాగుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ అందించిన సంగీతం బాగా హెల్ప్ అయ్యింది.