విజయ్ లియో.. మైండ్ బ్లోయింగ్ బిజినెస్

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కి మార్కెట్ ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తమిళ్ లోనే కాకుండా తెలుగు, హిందీలోనూ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వారసుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఈయన తాజాగా నటించబోతున్న చిత్రం లియో. ఈ చిత్రానికి టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే..!

250 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం విడుదల అవ్వకముందే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.246 కోట్ల డిజిటల్, శాటిలైట్, మ్యూజికల్ రైట్స్ అమ్మడు కాగా.. తాజాగా థియేట్రికల్ రైట్స్ తో 400 కోట్ల ప్రీ రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో డిజిటల్ రైట్స్ నుంచి రూ.150 కోట్లు, శాటిలైట్ రైట్స్ నుంచి రూ.50 కోట్లు, మ్యూజిక్ రైట్స్ నుంచి రూ.16 కోట్లు, థియేట్రికల్ రైట్స్ నుంచి రూ. 154 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో విజయ్ కు ప్రత్యర్థి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తుండగా.. విజయ్ సరసన త్రిష నటించబోతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, సాంగ్స్, పైట్స్ అన్ని బాగుండటంతో మూవీ హిట్ టాక్ ను తెచ్చుకుంది. 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం ఇది. అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ ఆకాశమే హద్దుగా మారనుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రానికి నిధులు సమకూరుస్తోంది. అక్టోబర్ 19వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోంది చిత్రబృందం. ఈ సినిమా ప్రోమో యూట్యూబ్ లో ఇప్పటికే సంచలనం సృష్టించి పెద్ద విజయాన్ని సాధించింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, టైగర్ 3 వ్యూస్ ను కూడా లియో అధిగమించింది. మరి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.