ఇప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర అలాగే రాజకీయాల్లో కూడా పరిస్థితులు మంచి వాడి వేడిగా ఉన్నాయని చెప్పాలి. ఆల్రెడీ మన దగ్గర ఏపీలో పరిస్థితి మంచి ఆసక్తిగా మారగా అటు తమిళ నాట పరిస్థితులు కూడా మరింత ఆసక్తిగా అయితే ఉన్నాయి.
ఇక ఇదిలా ఉండగా అక్కడ స్టార్ హీరో అయినటువంటి దళపతి విజయ్ ఇప్పుడు హీరోగా నటించిన “లియో” కంప్లీట్ చేసి బయటకి వచ్చాడు. అలాగే ఈ సినిమా తర్వాత అయితే మరి చిత్రం కూడా లైనప్ లో ఉంది. ఐతే ఆ మధ్య విజయ్ సినిమాలు ఇక ఆపేస్తున్నాను అని 68వ సినిమా తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అని తాను తెలిపినట్టుగా ఆ మధ్య వార్తలు అయితే వచ్చాయి.
ఇక ఇదిలా ఉండగా నిన్ననే తమిళనాడులో లియో కంప్లీట్ చేసాక ఫ్యాన్స్ ముఖ్యులతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో మరోసారి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ కోసం మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తాను ఒకవేళ రాజకీయాల్లోకి మాత్రం వస్తే ఖచ్చితంగా సినిమాలు చేయను అని పూర్తి దృష్టి రాజకీయాల మాత్రమే ఉంటుంది అని సినిమాలు ఉండవని చెప్పేశాడట.
దీనితో విజయ్ పాలిటిక్స్ పట్ల ఆసక్తిగానే ఉన్నాడు అని అదును చూసి ఎంట్రీ ఇస్తాడు అని మనం అర్ధం చేసుకోవచ్చు. కాగా విజయ్ నెక్స్ట్ అయితే రీసెంట్ ప్లాప్ “కస్టడీ” దర్శకుడు వెంకట్ ప్రభు తో సినిమా చేయనున్నాడు. అలాగే తన లియో చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.