ఇదేం ప్రేమరా బాబు.. బన్నీకి ‘రౌడీ’గిఫ్ట్

Vijay Devarakonda sents Rowdy Collections To Allu Arjun

టాలీవుడ్‌లో స్టైలీష్ స్టార్ అంటే ఎవరు అని ఏ ఒక్కరు కూడా ప్రశ్నించరు. ఎందుకంటే స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ ఒక్క అల్లు అర్జున్‌కు మాత్రమే నప్పుతుంది. పైగా ఆ ట్యాగ్‌ను కాపాడుకునేందుకు బన్నీ కూడా తెగ కష్టపడిపోతుంటాడు. కానీ ఆ మధ్య స్టైల్‌కి, యూత్‌కి ఐకాన్‌లా మారిపోయాడు రౌడీ స్టార్ విజయ దేవరకొండ. విజయ్ హవాను చూసి బన్నీ కూడా షాక్ అయ్యాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Vijay Devarakonda sents Rowdy Collections To Allu Arjun
Vijay Devarakonda sents Rowdy Collections To Allu Arjun

అలా వచ్చాడు ఇలా ఎదిగాడు. కొత్తగా ఫ్యాషన్ బ్రాండ్ ఓపెన్ చేశాడు. రౌడీ బ్రాండ్‌ను అలా జనాల్లోకి తీసుకెళ్లాడు. విజయ్ దేవరకొండ తన సినిమా ఈవెంట్లకు ఏ రేంజ్‌లో వెళ్తాడో అందరికీ తెలిసిందే. తనకు తానే తన కోసం తానే స్పెషల్‌గా డిజైన్ చేసుకుంటాడు విజయ్. అలా ఓ ఈవెంట్‌కు బన్నీ కూడా గెస్ట్‌గా వచ్చాడు. విజయ్ క్యాస్టూమ్ చూసి షాక్ అయ్యాడు. నాకు కూడా ఇలాంటి కలెక్షన్స్ ఉంటే ఇవ్వు అని స్టేజ్ మీదే అడిగేశాడు.

Vijay Devarakonda sents Rowdy Collections To Allu Arjun
Vijay Devarakonda sents Rowdy Collections To Allu Arjun

అదీ విజయ్ రేంజ్. అలా అనడం బన్నీ గ్రేట్ నెస్ కూడాను. అయితే బన్నీ ఎలా అన్నాకూడా విజయ్ తన ప్రేమను చాటుకుంటూనే ఉన్నాడు. తన దగ్గరకి కొత్త కలెక్షన్స్ వచ్చినప్పుడల్లా బన్నీకి పంపుతాడు. తాజాగా విజయ్ పంపిన కొత్త కలెక్షన్స్‌ను చూసి బన్నీ మురిసిపోయాడు. రౌడీ బ్రాండ్ లేటెస్ట్ కలెక్షన్స్ పంపించినందుకు థ్యాంక్యూవిజయ్.. సో స్వీట్ ఆఫ్ యూ అంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్నీ.