రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ …”లైగ‌ర్” విజయ్ ఫ‌స్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రంగంలోకి దిగేసాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. అలాగే, ఫస్ట్ ‌లుక్ ‌ను సైతం అభిమానులతో పంచుకుంది. ల‌య‌న్, టైగ‌ర్‌ల క్రాస్ బ్రీడ్ లైగ‌ర్ అంటూ చిత్ర టైటిల్ అనౌన్స్ చేసిన మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని స‌రికొత్త‌గా చూపించారు. ఈ పోస్ట‌ర్ సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

బాక్సింగ్‌ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ ఇప్పటికే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయ్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో విజయ్‌ కు జంటగా బాలీవుడ్‌ నటి అనన్య పాండే ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్. పూరి జగన్నాథ్, విజయ్ కాంబో కావడంతో ఈ మూవీపై విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.పూరితో పాటు, విజయ్‌కి ఇదే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో చిత్రంపై భారీ అంచనాలున్నాయి.