ఓహో రౌడీ బాయ్‌ని అలా వాడేస్తున్నారా?.. విజయ్ దేవరకొండతో సమంత రచ్చ

ఆహా యాప్‌ను తెలుగులో మరింత పాపులర్ చేసేందుకు అల్లు అరవింద్ శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే కొత్త కొత్త సినిమాలను కొనుగోలు చేయడం, స్టార్స్‌తో వెబ్ సిరీస్ ప్లాన్‌ చేయడం.. సమంతతో కొత్త షోన ప్రారంభించడం, బన్నీతో కొత్తగా ఏదో ప్లాన్ చేయబోతోన్నాడు. ఇలా అల్లు అరవింద్ దొరికే ప్రతీ అవకాశాన్ని వదలడం లేదు. ఆహాను తెలుగులో టాప్ ప్లేస్‌లో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

Vijay Devarakonda in Samantha Akkineni Sam Jam Show
Vijay Devarakonda in Samantha Akkineni Sam Jam Show

సమంతతో శామ్ జామ్ అనే కొత్త టాక్ షోను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం సమంతకు భారీగానే చెల్లించినట్టు తెలుస్తోంది. సమంత టాక్ షోలో టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ గెస్ట్‌లుగా రాబోతోన్నట్టు సమాచారం. అయితే ఇందులో మాత్రం మొదటగా వచ్చే గెస్ట్‌ ఎవరా? అని నెటిజన్లు ఎంతగానో ఆరా తీశారు. తాజాగా వాటికి సంబంధించిన సమాధానం దొరికింది.

Vijay Devarakonda in Samantha Akkineni Sam Jam Show
Vijay Devarakonda in Samantha Akkineni Sam Jam Show

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్‌ను ఆహా ఇలా వాడేందుకు శ్రీకారం చుట్టింది. సమంత తన శామ్ జామ్ షోలో మొదటగా విజయ్ దేవరకొండతో ముచ్చట్లు పెట్టబోతోన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ షోలో పాల్గొనేందుకు వచ్చిన విజయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రాన్నిచేస్తున్నాడు. త్వరలోనే మళ్లీ ఈమూవీ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.