ఇన్స్టాలోకి రావడంతో భారీ రికార్డు సెట్ చేసిన విజయ్.!

10_things_about_thalapathy_vijay_varisu-sixteen_nine

సౌత్ ఇండియా సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఒకరు. మరి సోషల్ మీడియా పరంగా అయితే మోస్ట్ ఇన్ఫ్లూయెన్స్ కలిగిన పర్సనాలిటీ గా అయితే తాను నిలిచాడు.

ఇక ట్విట్టర్ లో అయితే విజయ్ పెట్టె పోస్ట్స్ కి వచ్చే రెస్పాన్స్ ఇండియా లో ఏ హీరో కి కూడా రాదు. ఆ లెవెల్లో విజయ్ క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ట్విట్టర్ నుంచి విజయ్ ఈరోజే మరో యాప్ ఇన్స్టాగ్రామ్ లోకి అయితే అడుగు పెట్టాడు. మరి షాకింగ్ గా విజయ్ కి ఇన్స్టాగ్రామ్ లో రికార్డు ఫాలోవర్స్ వచ్చేసారు.

కేవలం రెండు గంటల్లోనే విజయ్ కి ఏకంగా 1 మిలియన్ కి దగ్గర ఫాలోవర్స్ వచ్చేసారు. అసలు ఈ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫాలోవర్స్ 1 మిలియన్ దగ్గర ఉండగా ఫస్ట్ పోస్ట్ కి కూడా 9 లక్షలకి పైగా లైక్స్ నో టైం లో వచ్చేసాయి.

దీనితో విజయ్ సెన్సేషనల్ ఎంట్రీ ఓ రేంజ్ లో మారుమోగుతోంది. ఇక విజయ్ అయితే లేటెస్ట్ గా దర్శకుడు లోకేష్ కనగ రాజు తో “లియో” అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తుండగా ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే మరో 60 రోజులు ఈ సినిమా షూటింగ్ బాలన్స్ ఉంది.