బాక్సాఫీస్ : సౌత్ లో యూనిక్ రికార్డు కొట్టిన విజయ్ “లియో”

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర ఓ రేంజ్ లో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన భారీ చిత్రాల్లో తమిళ స్టార్ హీరోస్ లో విజయ్ దళపతి నటించిన చిత్రం “లియో” కోసం అందరికీ తెలిసిందే. తమిళ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనకరాజు తెరక్కించిన ఈ సినిమా ఓ రేంజ్ లోకి అంచనాలు తీసుకెళ్లగా..

ఈ సినిమా విజయ్ సహా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కెరీర్ లోనే ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని అంతా అనుకోగా ఇప్పుడు అనుకున్నట్టే ఈ చిత్రం సెన్సేషనల్ వసూళ్లు నమోదు చేస్తుంది. కాగా సౌత్ లో అయితే ఈ చిత్రంతో హీరో విజయ్ ఒక యూనిక్ రికార్డు కొట్టినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా మొదటి రోజు మొత్తం నాలుగు రాష్ట్రాల్లో 10  కోట్లకి పైగా గ్రాస్ అందుకున్న సినిమాగా లియో నిలవగా దళపతి విజయ్ కెరీర్ లో అయితే ఇలా నాలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఏకైక హీరోగా నిలిచినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

దీనితో విజయ్ విజయ్ ఒక్క సౌత్ నుంచే మినిమమ్ 40 కోట్లు ఈజీగా రాబట్టేసాడు. ఇక ఫైనల్ నంబర్స్ తో అయితే ఇది 60 కోట్లకి ఎక్కువ ఉన్నా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్, అర్జున్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మొత్తానికి అయితే లియో సెన్సేషన్ ఇప్పుడు గట్టిగానే ఉందని చెప్పొచ్చు.