KGF 2 : యష్ తో విజయ్ ఢీ కొడతాడా.. బీస్ట్ ను అప్పుడే విడుదల చేయాలనుకుంటున్నాడా..?

KGF 2:తమిళ్ సినిమా హీరో దళపతి విజయ్ వరుస సినిమా విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటీవల వచ్చిన విజయ్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న బీస్ట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బీస్ట్ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.ప్రేమికుల రోజు సందర్బంగా బీస్ట్ సినిమాలోని హలమితి హబిబో..పాట లిరికల్ వీడియోను విడుదల చేసారు చిత్ర యూనిట్. విడుదలైన రోజునుండి ఎప్పటికి అత్యధిక వ్యూస్ అందుకుంటూ రికార్డులు సృష్టిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ‘కెజియఫ్2’తో క్లాష్ కి సిద్ధం అవుతున్నట్లు వినిపిస్తోంది. యష్ నటించిన ‘కెజిఎఫ్2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ కి రెడీ అవుతోంది.యష్  నటించిన కేజిఎఫ్ ఎంత భారీ విజయాన్ని అందుకున్న అందరికీ తెలిసిందే, సీక్వెల్ గా వస్తున్న కేజిఎఫ్ 2 మీద కూడా అంచనాలు అంతే రేంజ్ లో ఉన్నాయి.

అయితే బీస్ట్ సినిమా ని ఎప్పుడు విడుదల చేస్తారు ఇంతవరకు ప్రకటించలేదు కానీ ఏప్రిల్ లో విడుదల చేయాలని చిత్రబృందం ప్రకటించింది.తాజా సమాచారం మేరకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ‘బీస్ట్’ను ఏప్రిల్ 13న విడుదల చేయాలని నిర్ణయించినట్లు వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కే జి ఎఫ్ 2,బీస్ట్ సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ పోరు తప్పదు.ఒక రోజు గ్యాప్ లోనే రెండు సినిమాలు పోటీపడబోతున్నాయన్నమాట.పోటీ ఖాయం అని ట్రేడ్‌లో వినిపిస్తున్నప్పటికీ ఎవరూ ఖచ్చితమైన రిలీజ్ డేట్స్ ను అధికారికంగా ప్రకటించలేదు. ఎవరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అధికారికంగా ప్రకటిస్తే తెలుస్తుంది.